హైదరాబాద్ : హైదరాబాద్ ఎంపి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుర్తించారు. అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి ఎంపిలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు గుర్తించారు. ఈ సంఘటన ఒక మతం మీద మరొక మతం సాధించిన విజయమా అని ప్రశ్నించారు. అలాగే, బాబ్రీ మసీదు జిందాబాద్.. భారత్ జిందాబాద్ అంటూ ఆయన లోక్‌సభలో నినాదం చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక మతానికి చెందినదా లేక అందరికీ చెందినదా? అని నేను అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు రామా లయం కట్టినా బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం అలాగే ఉంటుందని నా విశ్వాసం చెబుతోంది‘ అని లోక్‌సభలో రామమందిరంపై అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
దేవాలయాలను ధ్వంసం చేయడంలో మొఘల్ చక్రవర్తి బాబర్ పాత్రపై బిజెపి ఎంపిలు ప్రశ్నించగా ఒవైసీ స్పందిస్తూ మొఘల్ చక్ర వర్తుల ప్రతినిధినా అని ప్రశ్నించారు. ‘నేను బాబర్, జిన్నా లేదా ఔరంగజేబు ప్రతినిధినా? నేను రాముడిని గౌరవిస్తాను కానీ హే రామ్ అని చివరి మాటలు చెప్పిన వ్యక్తిని చంపిన నాథూరామ్ గాడ్సేను నేను ద్వేషిస్తున్నాను‘ అని ఓవైసీ అన్నారు. అలాగే, బాబ్రీ మసీదు చిరకాలం జీవించే వుంటుందని అన్న. భారత్‌తో జీవించి వుంటుంది. అలాగే జీవించండి, జై హింద్‘ అని చర్చ సందర్భంగా ఓవైసీ అన్నారు. ఆర్టికల్ 370పై సుప్రీం కోర్టు 2019 తీర్పును కూడా ఒవైసీ విమర్శించారు. ఇది ‘అత్యంత దారుణమైన చర్య‘ అని పేర్కొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెం బర్ 6 నాటి సంఘటనలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వైఖరిని విమర్శించారు. కాగా, ఎఐఎంఐఎం ఎంపి ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్‌పర్సన్ రాజేంద్ర అగర్వాల్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వం డిసెంబర్ 6న రామాలయ ప్రారంభోత్సవాన్ని మాత్రమే జరుపుకున్నదనీ, ఏ పండుగా కాదని మండిపడ్డారు.