Monday, December 23, 2024

బిఆర్‌ఎస్‌పై అసదుద్దీన్ ఒవైసి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఒవైసి అసదుద్దీన్ తెలిపారు. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ షకీల్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని సవాల్ విసిరారు. ఎంఐఎం కౌన్సిలర్లు, నేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. అరెస్టయిన ఎంఐఎం నేతలు, కవిత్, షకీల్ గెలుపు కోసం పని చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్, డిజిపి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏ పార్టీతో ముందుకెళ్లాలనే దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఎంఐఎం కూడా ప్రత్యామ్నాయంగా ఉందన్నారు. మసీదులు తొలగించి సచివాలయం కట్టారని అసదుద్దీన్ ఒవైసి దుయ్యబట్టారు. మైనార్టీలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాట్నా మీటింగ్‌కు తనని ప్రతిపక్షపార్టీలు పిలువలేదన్నారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News