Monday, December 23, 2024

అంతర్జాతీయంగా మోడి ఇమేజ్ ఉత్తిదే : అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అంతర్జాతీయంగా భారత ప్రధాని నరేంద్ర మోడి ఇమేజ్ చాలా బలంగా ఉందనేది అంతా ఉత్తిదేనని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అన్నారు. ఈ అబద్ధాన్ని చెప్పడం పై దేశంలోని సామాన్య ప్రజలను తిడుతున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మోడికి స్వాగతం పలకడానికి దక్షిణాఫ్రికాకు చెందిన సాధారణ మంత్రి వచ్చారని, ఆ దేశపు అధ్యక్షుడు చైనా అధ్యక్షుడితో బిజీగా ఉన్నారని, అందుకే ఓ మంత్రి వచ్చినట్లు దక్షిణాఫ్రికా నుండి వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.. ఇది విన్న మోడి ఫ్లైట్ దిగడానికి నిరాకరించినట్లు వార్తలు వచ్చాయని ఇదే నిజమైతే ఒక ప్రధానికి ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు సరిపోతాయా అనేది ఆలోచించాల్సిన విషయమని అసదుద్దీన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News