- Advertisement -
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. గతంలో 15 నిమిషాల్లో తరమికొడతామంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ 15 నిమిషాలు కాదు 15 సెకన్లలో అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ పేర్కొంది. ఈ వివాదంపై స్పందించిన ఒవైసీ15 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి మాకు ఏం భయం లేదంటూ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు తిరిగి కౌంటర్ ఇచ్చారు. బిజెపి హైదరాబాద్ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా నవనీత్ కౌర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. హైదరాబాద్ మరో పాకిస్థాన్ కావొద్దంటే మాధవీ లతను గెలిపించాలని నవనీత్ కౌర్ ప్రజలను కోరారు.
- Advertisement -