Sunday, December 22, 2024

నగరంలో శాంతిభద్రతలు లేవు

- Advertisement -
- Advertisement -

ముస్లింల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని హైదరాబాద్ ఎంపి, మజ్లిస్ అసదుద్దిన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు.చివరికి దేశంలోని ముస్లింలను అంటరాని వారిగా చూస్తున్నారని స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ముస్లింల పట్ల ఎటువంటి దృష్టి సారించలేదని, నిర్మలా సీతారామన్ పద్దులు ముస్లిం వర్గాలను దాటవేస్తూ ఖరారు అయ్యాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో సోమవారం అసద్ మాట్లాడారు. దేశంలోని ముస్లింల పరిస్థితి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ నా ప్రియమైన దేశంలో ముస్లింలు నిరుపేదలుగా ఉన్నారు. ముస్లిం మహిళలు అత్యధిక స్థాయిలో నిరాశ నిస్పృహలకు లోనయ్యారు’ అని ఆయన ఘాటుగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం పాటిస్తున్న సమ్మిశ్రితం, సమానత్వం ఏ దిశలో వెళ్లుతున్నది? ప్రభుత్వ దృక్పథ కోణంలో చూస్తే ముస్లింలు అంతా అంటరాని వాళ్లు అనే విషయం స్పష్టం అవుతోందని హైదరాబాద్ ఎంపి కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు.

మరి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి కేవలం నాలుగు వర్గాలను ప్రస్తావించారు. వారికి కేటాయింపుల కోసం తాపత్రయపడ్డారు. అయితే దేశంలోని ముస్లింల్లో పేదలు, యువత, రైతులు, మహిళలు లేరనే తీరుతో బడ్జెట్ ప్రసంగం , బడ్జెట్ కేటాయింపులు జరిగాయని విమర్శించారు. ఈ సందర్భంగా తన వాదనను బలోపేతం చేసుకునేందుకు ఈ ఎంపి గణాంకాలను పొందుపర్చారు. ముస్లింలలో 15 నుంచి 24 సంవత్సరాల లోపు వారిలో కేవలం 29 శాతం మందికే విద్యా సౌకర్యం ఉంది. బిసిలు, ఎస్‌సి ఎస్‌టిలు, అగ్రవర్ణాలతో పోలిస్తే ఈ నిష్పత్తి పేలవంగా ఉందన్నారు. కాగా ఉన్నత విద్య స్థాయికి చేరుకునే ముస్లింల సంఖ్య కేవలం 5 శాతమే ఉంది. ఈ దశలో ఆయన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎఫ్‌ఎల్‌ఎస్) ను ప్రస్తావించారు. జీవన క్రమంలో ముస్లింలు అనేక విధాలుగా ఆర్థిక చిక్కులు ఎదుర్కొంటున్నారు. సరైన జీవనోపాధి ఉండదు. ఎక్కువగా చిల్లర వ్యాపారాలు రోజువారి పనులతో కొంత మేరకు ఉపాధి పొందే వారి సంఖ్య 58.4 శాతం వరకూ ఉంది. అయితే ముస్లింలలో ఉద్యోగాలు పొందిన వేతన జీవుల జాబితాలో చేరిన వారు 15 శాతమే ఉన్నారు.

కూలీలుగా పనిచేస్తున్న వారు 26 శాతంగా ఉన్నారని, నిజాలు ఈ విధంగా ఉండగా ఆర్థిక మంత్రి వీరి గురించి ప్రసంగంలో కనీసం మాట కూడా ప్రస్తావించలేదు. ఇక ఆర్థిక మంత్రి ప్రసంగంపై ఏమి చెప్పగలం? అని మాట్లాడుతామని ప్రశ్నించారు. తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ముస్లిం వర్గాలను ఈ దేశంలో అంటరానివారిగా ఖరారు చేశారు. వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. దేశ ప్రగతిలో వారికి ఎటువంటి ప్రాతినిధ్యం లేదన్నారు. ముస్లిం యువతకు ఉద్యోగాలు రావు, విద్యావకాశాలు దక్కవని నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News