Wednesday, January 22, 2025

మెదక్ ఘటనపై అసదుద్దీన్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

మెదక్‌లో జరిగిన ఘర్శణలపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘర్శణలకు కారణాలపై ఆరా తీశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటెలిజెన్స్ అధికారి, మెదక్ జిల్లా ఎస్‌పితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. ఈ ఘర్శణలకు కారకులపై కఠని చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు. బాధితులకు సహకారం అందించాలని ఆయన పార్టీ స్థానిక నేతలకు సూచించారు. పరిస్థితులు చక్కదిద్దేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.

పండ్ల మార్కెట్‌లో వసతులు కల్పించాలి
హైదరాబాద్ నగర శివారు పహాడీషరీఫ్ పరిధిలోని మామిడిపల్లి ఫ్రూట్ మార్కెలక్షలో మౌలిక వసతులు కల్పించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. మామిడిపల్లిలో వక్ఫ్‌భూమిలో ఫ్రూట్‌మార్కెట్‌కు భూమి లీజుకు ఇవ్వడం జరిగిందని, ఇక్కడ లక్షల రూపాయల ఖర్చుతో పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాగునీరు, పారిశుద్దం, రోడ్లు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో లైసెన్సులు కలిగిన ఉన్న 341 మంది వ్యాపారులకు ఇక్కడ వ్యాపారం చేసుకోడానికి అనుమతించడం జరిగిందని ఆయన మంత్రికి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News