Wednesday, January 22, 2025

నాసిక్‌లో ఏఐఎంఐఎం నేతపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

మాలేగావ్ మాజీ మేయర్ , ఏఐఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనిస్‌పై సోమవారం తెల్లవారుజామున మోటారు బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఆయనకు మూడు తూటాలు తాకాయి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆయనను నాసిక్‌లో మరో వైద్యశాలకు తరలించారు. మహారాష్ట్ర ఎంఐఎం శాఖలో అబ్దుల్ ప్రముఖ నాయకుడు.

సోమవారం తెల్లవారు జామున 1.20 సమయంలో ఓల్ ఆగ్ర రోడ్డు లోని ఒక రెస్టారెంట్ ఎదుట కూర్చొని ఉండగా ఈ దాడి జరిగినట్టు నాసిక్ పోలీస్‌లు వెల్లడించారు. నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి తరలి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్‌లు అక్కడకు చేరుకొని సంయమనం పాటించాలని కోరారు. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News