Monday, December 23, 2024

హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారు: అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi Press Meet

హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీమైన రోజు అని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం నిర్వహించాలన్నారు. విమోచన దినోత్సవంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖలు రాశామని అసదుద్దీన్ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం హిందువులు, ముస్లింలు కలిసి పోరాడారని ఓవైసి వెల్లడించారు. తురేబాజ్ ఖాన్ వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు. 17న పాతబస్తీలో తిరంగాయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తాము నిర్వహించే బహిరంగ సభలో ఎంఐఎం ఎమ్మెలంతా పాల్గొంటారని ఓవైసీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News