Tuesday, September 17, 2024

జిహెచ్‌ఎంసి ఆఫీస్‌ను కూల్చేస్తారా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ న గరంలో హైడ్రా కూల్చివేతలు సంచలనం రేకిస్తున్నాయి. హైడ్రా దూకుడుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి స్పందించారు. ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ భవన సముదాయాలను కూడా కూల్చివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ దారుస్సలాంలో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాలను కూల్చి వేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా అని నిలదీశారు. హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయబోతున్నారని, నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో

ఉందని మరి దాన్ని కూడా తవ్వేస్తారా అని హైడ్రా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కార్యాలయం కూడా నీటి కుంటలో నిర్మించిందేని, మరి నాలా మీద కట్టిన జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని కూడా కూల్చేస్తారా అంటూ వాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని, ఆ గోల్ఫ్ కోర్టులో ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా గోల్ఫ్ ఆడుతారని గుర్తు చేశారు. ఒకసారి అక్కడికి వెళ్లి చూడండి, లేదంటే ఫోటోలు కావాలంటే తాను ఇస్తానన్నారు. ఎఫ్‌టీఎల్ సమస్యపై హైదరాబాద్ నగర మేయర్‌ను కలిసి చెప్పానని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తానన ఆయన తెలిపారు.

వక్ఫ్‌ను అంతం చేయాలనే బిజెపి కుట్ర
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశ పెడుతోందని ఓవైసీ మండిపడ్డారు. ముస్లింలు లేకుండా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. మజీద్‌లు, దర్గాల లాగే వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ఆస్తులు కావని, ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ఆస్తులకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీద్‌కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బిజెపి చూస్తోందని ఆయనన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బిజెపిపై ఆగ్రహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు.

వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా చేయాలనుకుంటున్నారని అన్నారు. సెక్షన్ 40లో తప్పులు జరిగి ఉంటే ఉదాహరణ చూపించమని ప్రధానిని డిమాండ్ చేశారు.
కాశీ విశ్వనాథ్ టెంపుల్ మెంబర్ కావాలంటే కేవలం హిందూ మాత్రమే అని సెక్షన్లో ఉంది. మరి వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలు ఎందుకు ఉండకూడదు?. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎండోన్మెంట్ మెంబర్ కావాలంటే కచ్చితంగా హిందూ అయ్యుండాలనే నిబంధన ఉంది. వక్ఫ్ బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిం తప్పకుండా ఉండాలనడం వెనుక మతలబు ఏంటి?. దీనికి మోడీ సమాధానం చెప్పాలి’ అని అసదుద్దీన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News