Friday, November 15, 2024

ఢిల్లీ ఘటనపై అసదుద్దీన్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం వ్యక్తిని కాలితో తన్ని దాడికి పాల్పడిన పోలీసు తీరుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లాం పట్ల ఇంత విద్వేశాలను నూరిపోసిందెవరని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలోని ఇందర్‌లో జరిగిన ఈ ఘటన కలిచివేసిందని, ముస్లింలపై ఎంత గౌరవం ఉందో దీన్నిబట్టి స్పష్టమవుతోందని ఆయనన్నారు. బాధితుడు ఏ కుటుంబానికి చెందిన వాడో ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి సమాధానం చెప్పాలని ఓవైసి డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఓవైసి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నమాజీలను తన్నుతున్న పోలీసును సస్పెండ్ చేశారు.

కానీ ముస్లింల పట్ల ఇలా ప్రవర్తించడం ఇప్పుడు సమాజంలోని మెజారిటీ వర్గానికి గర్వకారణంగా ఉందా అని ఒవైసి ప్రశ్నించారు. పోలీసు ధైర్యానికి కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. బహుశా బిజెపి అతన్ని తమ అభ్యర్థిగా కూడా చేయవచ్చని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. గుర్గావ్‌లో పోలీసుల అనుమతితో ఖాళీ ప్లాట్‌లో ముస్లింలు నమాజ్ చేస్తారని, అయితే సంఘీలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయనన్నారు. చాలా మంది మతపరమైన, మతం లేని వ్యక్తులు సాంస్కృతిక ప్రయోజనాల కోసం వీధులను ఉపయోగిస్తున్నారని, అయితే ఇస్లాం పట్ల ద్వేషం ఇప్పుడు సర్వసాధారణంగా మారినందున ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఓవైసి బిజెపిపై విరుచుకుపడ్డారు. అనంతరం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News