Thursday, March 20, 2025

ఓటరుగా రెండు చోట్ల ఓవైసీ పేరు నమోదు: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: ఆల్ ఇండియా మజ్లీస్‌ఇఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నియమాలకు విరుద్ధంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన పేరును నమోదుచేసుకున్నారని కాంగ్రెస్ నాయకుడు జి.నిరంజన్ పేర్కొన్నారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) సభ్యుడైన నిరంజన్ ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్‌కు జనవరి 5న రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పేరు నమోదు చేసుకున్నారని ఆక్షేపణ తెలిపారు. రాజేంద్రనగర్‌లో, ఖైరాతాబాద్‌లో రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇది ఎంపీ అయిన ఆయన బాధ్యతారాహిత్యాన్ని , ఓటర్ల తుది జాబితా ప్రచురించిన ఎన్నికల యంత్రాంగం నిర్లక్షాన్ని సూచిస్తోందన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో అసదుద్దీన్ నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా కాపీలను కూడా నిరంజన్ జతచేశారు. వాటిని ఆయన భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News