Monday, December 23, 2024

హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్

- Advertisement -
- Advertisement -

Asaduddin Owaisi slams BJP Over Raja Singh Issue

హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్
రాజాసింగ్‌కు ఇప్పటికీ పెద్దల మద్ధతు : అసద్ ఆరోపణలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్‌పై బిజెపి కుట్ర చేసిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బిజెపి సర్జికల్ స్ట్రైక్ చేసిందన్నారు. కానీ బిజెపి సర్జికల్ స్ట్రైక్‌ను హైదరాబాద్ ప్రజలు భగ్నం చేశారని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని ఆయన స్పష్టం చేశారు. కొందరి ఇళ్లల్లోకి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పోయి అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. వాళ్లను విడిపిస్తే దాంట్లో తప్పేముందుని నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బిజెపి మద్ధతుందని ఆయన ఆరోపించారు.

Asaduddin Owaisi slams BJP Over Raja Singh Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News