Wednesday, January 22, 2025

మోడీని ఓడించాలంటే… : ఓవైసి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బిజెపికి, ప్రధాని మోడీకి అనుకూలంగా మారుతుందని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి అన్నారు. బిజెపిని ఓడించాలంటే అన్ని నియోజకవర్గాల్లో విపక్షాలు ఎంతో పట్టుదలతో పనిచేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బిజెపికి గట్టి పోటీని ఇవ్వాలని, విపక్షాల నుంచి ఒకే వ్యక్తిని మాత్రమే ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే ప్రయోజనం ఉంటుందని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్‌ని నిలబెట్టినా మోడీకే లబ్ధి చేకూరుతుందని అన్నారు. మోడీకి సరైన విపక్ష అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పార్లమెంటులో మమతా బెనర్జీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారని…అయితే అదే సమయంలో మోడీని ప్రశంసించారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News