Sunday, January 19, 2025

కెసిఆర్ కుటుంబానికి బాసటగా అసదుద్దీన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి కెసిఆర్ కుటుంబానికి బాసటగా నిలిచారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని మోడి ప్రభుత్వం టార్గెట్ చేసిందని విమర్శించారు.

కెసిఆర్ కుమార్తె ఎంఎల్‌సి కవితను ఇడి విచారణ నేపథ్యంలో ఒవైసి పై విధంగా స్పందించారు. ముస్లింల ఆర్థిక బహిష్కరణకు బిజెపి ఎంపిలు పిలుపునిచ్చారని, ఇంట్లో ఆయుధాలు ఉంచుకోవాలని కోరారని అలాంటి వారిని వదిలేసి తెలంగాణ సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన కుటుంబాన్ని లక్షంగా చేసుకోవడంలో మోడి ప్రభుత్వం బిజీగా ఉందని ఒవైసి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News