హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం స్వాగతించారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు అభినందనలు. కొత్తగా ప్రారంభమైన పార్టీకి నా శుభాకాంక్షలు” అని అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బుధవారం కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన ముచ్చట తెలిసిందే. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సిఎం కెసిఆర్ అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
Congratulations to @TelanganaCMO on @trspartyonline’s transformation into a national party. My best wishes to the party on their new beginning.
— Asaduddin Owaisi (@asadowaisi) October 5, 2022