- Advertisement -
హైదరాబాద్: ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూ సేన కార్యకర్తలు మంగళవారం దాడికి దిగారు. ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలోకి చొచ్చుకు వచ్చిన హిందూ సేన కార్యకర్తలు ఇంటి తలుపు, నేమ్‌ప్లేట్, ఇంటి బయటికి ఉన్న అద్దాలను పగులగొట్టారు. కాగా, దాడికి పాల్పడ్డ ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చశారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను హిందూ సేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని హిందూ సేన అధినేత విష్ణుగుప్తప తెలిపారు. ఎంసిగా అసద్‌కు కేటాయించిన అధికారిక బంగ్లా ఇంటి గేటుతో పాటు, అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ముక్కల్ని ఇంటి ఆవరణలో చెల్లాచెదురుగా పడేశారు.
- Advertisement -