Monday, December 23, 2024

జనాభాపై యోగి ఆదిత్యనాథ్, ఓవైసీది తలో రకం మాట!

- Advertisement -
- Advertisement -

 

Asaduddin and Yogi

హైదరాబాద్: ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఓ వర్గం ప్రజల సంఖ్య పెరిగిపోయి ఇక్కడి మూల నివాసుల సంఖ్య కన్నా పెరిగిపోకుండా చూడాలన్నారు. ఏదేని దేశంలో జనభా అసంతులనంగా ఉన్నట్లయితే అది చింతించించాల్సిన విషయం కాగలదన్నారు. ఒక వర్గం జనాభా పెరిగిపోతే దాని ప్రభావం మతపరమైన జనాభా (రిలీజియస్ డెమోగ్రఫీ)పై పడుతున్నారు. నేడు పెరుగుతున్న జనాభాని నియంత్రించాల్సి ఉందని, అదే సమయంలో అన్ని వర్గాల డెమోగ్రఫీ సంతులాన్ని మెయిన్‌టెయిన్ చేయాల్సి ఉందన్నారు.
ఇదిలావుండగా దీనిపై పార్లమెంటు సభ్యుడు, ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ప్రతిస్పందించారు. ముస్లింలు భారతీయులు కాదా? ఒకవేళ వాస్తవాన్ని పరిశీలించినట్లయితే ఈ దేశ మూల వాసులు గిరిజనులు, ద్రవిడులు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి చట్టం లేకుండానే ఫలదీకరణ రేటు(ఫెర్టిలిటీ రేటు) 2026-2030 నాటికి కోరుకున్న స్థాయికి చేరుకుంటుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News