Monday, December 23, 2024

మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో…

- Advertisement -
- Advertisement -

వర్సటైల్ యాక్టర్, డైరెక్టర్ రవిబాబు నుంచి మరో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ రాబోతోంది. ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్ ’అసలు’. పూర్ణ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించగా రవిబాబు స్వయంగా కథ అందించారు. తాజాగా ’అసలు’ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పవర్‌ఫుల్ కాప్‌గా రవిబాబు రంగంలోకి దిగడం, ఈ కేసులో నలుగురు అనుమానితులు, నాలుగు రహస్యాలు, ఒక ఆశ్చర్యకరమైన నిజం, చివరికి హంతకుడు ఎవరు?.. ఇలా ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తూ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా సాగింది. రవిబాబు మరో యూనిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ని చూపించబోతున్నారని ఈ ట్రైలర్ భరోసా ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News