Friday, September 27, 2024

రూ 300 కోట్ల స్కామ్ ఆసామీ

- Advertisement -
- Advertisement -

బృందావనంలో తేలిన స్వామి
మథుర : మహారాష్ట్రలో 300 కోట్ల రూపాయల మేర వేలాది మందిని ముంచేసిన ఓ ఆసామి స్వామి అయ్యాడు . ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో సర్వసంగ పరిత్యాగ స్వామిగా తేలాడు. పలు మోసాలకు పాల్పడి ఇప్పుడు బృందావన్‌లోని కృష్ణ బలరామ్ దేవాలయం వద్ద స్వామిగా సన్నాసిగా వెలిసి , బాబన్ విశ్వనాథ్ షిండేను అరెస్టు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. బీడ్ జిల్లా, స్థానిక బృందావన్ పోలీసుల సంయుక్త గాలింపుల దశలో ఈ కపట బాబాను పట్టుకుని , అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఫింబే బాబాజీది మహారాష్ట్రలోని బీడ్ జిల్లా ప్రాంతం. ఇక ఓ సహకార బ్యాంక్‌లోని నాలుగు శాఖల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని, భారీ స్థాయిలో వడ్డీలు దక్కేలా చేస్తానని దాదాపు రెండు వేల మందిని మభ్య పెట్టి , వీటితో తాను ఆస్తులు కొనుక్కుని ఆ తరువాత ఉడాయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందం (సిట్) ఏర్పాటు అయింది. అయితే ఢిల్లీ, అస్సాం, నేపాల్ వంటి పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ , ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీకృష్ణుని బృందావనంలో తిష్టవేసుకున్నట్లు గుర్తించారు. ఈ స్వామిని మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు బీడ్ జిల్లా సీనియర్ ఎస్‌పి అవినాష్ బర్గాల్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News