Monday, January 20, 2025

ఆసరా పింఛన్ దరఖాస్తులను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : ఆసరా పింఛన్‌దారులు మరణించిన వారి స్థానంలో భాగస్వామి ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకుని ఉంటే అట్టి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపిడిఓలను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రజావాణి హాల్లో మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్ష పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసరా ఫించన్, గృహలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ ప్లాట్ల పంపిణీ, తెలంగాణకు హరితహరం తదితర పథకాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలె కాలంలో ఆసరా పింఛను తీసుకోని వారి జాబితాను డిఆర్‌డిఓ ద్వారా మండల అభివృద్ధి అధికారులకు పంపించడం జరుగుతుందని దాని ఆధారంగా ఆయా గ్రామ పంచాయతీలో లేదా మున్సిపాలిటీలో మరణించిన ఆసరా పింఛన్‌దారులను గుర్తించాలని, వారి భాగస్వామి పేరున ఆసరా పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా వచ్చిన దరఖాస్తులను ఎంపిడిఓ స్థాయిలో పరిష్కరించి డిఆర్‌డిఓకు వారం లోపల పంపించాల్సిందిగా ఆదేశించారు.

తెలంగాణకు హరితహారంపై సమీక్ష నిర్వహిస్తూ తెలంగాణ వజ్రోత్సవాల్లో భాగంగా ఆగస్టు 26న రాష్ట్రంలో ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడమైందని అందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 4.2 లక్షల మొక్కలు నాటేందుకు లక్షంగా నిర్దేశించడం జరిగిందన్నారు. అందువల్ల ప్రతి గ్రామ పంచాయతీ నుండి 27వ తేదిన వెయ్యి మొక్కలు నాటే విధంగా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని ఎంపిడిఓలను ఆదేశించారు. 2023 సంవత్సరం హరితహారంలో ఇచ్చిన లక్షాలను అదనంగా 20శాతం మొక్కలు ఆగస్టు 26లోపు పూర్తి చేయాలని సూచించారు.

దశాబ్ది సంపద వనాల్లో భాగంగా జిల్లాలో 57 వేల మొక్కలు నాటాల్సి ఉందని అందుకు అనువైన స్థలం ఇరిగేషన్ శాఖ ద్వారా మిగిలిపోయిన స్థలాన్ని గుర్తించి సంపద వనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గృహలక్ష్మిపై సమీక్షిస్తూ ఈ నెల 15వ తేది వరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పంచాయతీ సెక్రటరీ ద్వారా స్కూటీని చేయించి పంపించాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం లేదా ఆదాయ పత్రం లేదని చిన్న చిన్న కారణాలతో గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించవద్దని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామి ద్వారా ఉద్యానవన పంటల సాగును ప్రొత్సహిస్తుందని అందువల్ల 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులను గుర్తించి పళ్ల తోటల సాగుకు ప్రొత్సహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నర్సింగ్ రావు, డిపిఓ కృష్ణ, జెడ్పి సిఈఓ ఉష, బిసి వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News