Thursday, January 23, 2025

మరో లైంగిక దాడి కేసులో దోషిగా ఆశారాం బాపు నిర్థారణ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : తనకు తాను భగవంతుడిగా చెప్పుకునే ఆశారాం బాపును మరో లైంగిక దాడి కేసులో దోషిగా గుజరాత్ కోర్టు సోమవారం నిర్ధారించింది. మంగళవారం శిక్షలు ఖరారవుతాయి. అహ్మదాబాద్ జిల్లా మోటేరా లోని ఆశ్రమంలో ఉన్నప్పుడు 2013లో ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు సూరత్‌కు చెందిన మహిళా భక్తురాలు పదేళ్ల కిందటే ఫిర్యాదు చేసింది.

దీనిపై గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఆశారం బాపును దోషిగా నిర్ధారించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆశారాం ప్రస్తుతం మరో అత్యాచార కేసులో రాజస్థాన్ లోని జోథ్‌పూర్ జైలులో ఉన్నాడు.ఈ కేసుపై విచారణ జరిపిన జోథ్‌పూర్ ట్రయల్ కోర్టు 2018లె ఆశారాం బాపును దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News