Thursday, January 23, 2025

జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అప్రెంటిస్‌షిప్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటుగా భారతీయ యువత అప్రెంటిస్‌షిప్‌ను స్వీకరించేలా చేయడానికి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్ధాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డీఈ) దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 250కు పైగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. తద్వారా సంస్థలు, ఔత్సాహికులు, భాగస్వాముల నడుమ అప్రెంటిస్‌షిప్‌ సంస్కరణల పట్ల అవగాహన కల్పించనున్నారు. రీజనల్‌ డైరెక్టోరేట్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ సంబంధిత ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను నిర్వహించనుంది.

ఈ వర్క్‌షాప్స్‌ గురించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంతిత్వ్రశాఖ (ఎంఎస్‌డీఈ) కార్యదర్శి అతుల్‌ కుమార్‌ తివారీ మాట్లాడుతూ చదువుకుంటూనే పనిచేయడమనేది ఎడ్యుకేషన్‌టు వర్క్‌ ట్రాన్సిషన్‌లో నిలకడైన విధానమన్నారు. ఈ కారణం చేతనే దేశవ్యాప్తంగా 250 వర్క్‌షాప్‌లను ఎంఎస్‌డీఈ నిర్వహించనుందంటూ తద్వారా అప్రెంటిస్‌షిప్‌ ప్రయోజనాలను యువతతో పాటుగా వ్యాపార సంస్ధలకు సైతం వెల్లడిస్తున్నామన్నారు. అప్రెంటిస్‌షిప్‌ చట్టం–1961 లో సంస్కరణల కారణంగా మన యువత అత్యుతమ శిక్షణ పొందగలరన్నారు

తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి తొలి వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌లో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ వద్ద జనవరి 24, 2023న నిర్వహించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి ఐ రాణి కుముదిని, ఐఏఎస్‌ ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో రీజనల్‌ డైరెక్టోరేట్‌ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ (ఆర్‌డీఎస్‌ఈలు), బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ (బోట్‌), రాష్ట్ర ప్రభుత్వ జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ (డీఎస్‌సీ), జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పోరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) , విద్యా సంస్ధలు, పరిశ్రమ భాగస్వాములు, సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ (ఎస్‌ఎస్‌సీ)లు నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీమతి రాణి కుముదిని , ఐఏఎస్‌ మాట్లాడుతూ ‘‘ఏ రంగంలో అయినా నైపుణ్యంతో కూడిన కార్మికుల అవసరం ఉంటుంది. అప్రెంటిస్‌షిప్‌ ఈ అవసరాలను తీర్చగలదు. ఈ తరహా వర్క్‌షాప్‌ల ద్వారా మన యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటుగా ప్రస్తుత వ్యాపార వాతావరణంలో డిమాండ్‌ను సైతం తీర్చగలము. ఎంఎస్‌డీఈ చేపట్టిన ఈ కార్యక్రమం మరియు నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వద్ద ఐఎస్‌డీఎస్‌ శ్రీ కె శ్రీనివాసరావు ఈ వర్క్‌షాప్‌ నిర్వహించడాన్ని అభినందిస్తున్నాను’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News