Wednesday, January 22, 2025

ఆశావర్కర్ల ధర్నా

- Advertisement -
- Advertisement -

నాంపల్లి: ప్రభుత్వ ఆధీనంలో శిక్షణ పొంది 18 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్లకు 18వేల వేతనం, జిల్లా కేంద్రంలో రెస్ట్ రూంలు ఏర్పాటు చేయాలని, అదనపు పనులు అప్పగించవద్దని, జాబ్ చార్జ్ ప్రకటించాలని ప్రధాన డిమాండ్‌ లతో సిఐటియు అనుబంధ సంస్థ తెలంగాణ ఆశా వర్కర్ల యూనియర్ ఆదేశాల మేరకు నాంపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ధర్నా నిర్వహించి , వైద్యాధికారి సయ్యద్ ఇక్బాల్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమానికి జిల్లా ప్రజా నాట్యమండలి అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశావర్కర్లకు 18వేల వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి శిక్షణ పొంది గ్రామీణ ప్రాంత ప్రజలకు వివిద సేవలనందిస్తున్న ఆశావర్కర్లకు చాలీ చాలని వేతనం ఇస్తుండటంతో వారి జీవితాలు దుర్భరంగా మారి వారి కుటంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ సేవలు అందిస్తూ జిల్లా కేంద్రాలకు వెళితే రెస్ట్ రూంలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,వారికి జిల్లా కేంద్రంలో రెస్టు రూంలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేశారని, అయినా వారి సేవలకు గుర్తింపు ఇవ్వలేదని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న 6నెలల జీతం వెంటనే చెల్లించాలని , పనిభారం తగ్గించాలని, అదనపు పనులకు స్వస్తి పలకాలని, పారదర్శకంగా పనులు చేయించాలని అన్నారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు రమావత్ కవిత, మండల ప్రధాన కార్యదర్శి ఎదుళ్ల సునీత, ఉపాధ్యక్షురాలు కవిత,జిల్లా కమిటి సభ్యులు మమత, కోరెర లలిత, మండల కమిటి సభ్యులు లక్ష్మమ్మ, విజయలక్ష్మి, శోభ,సైదమ్మ, నీలిమ, అండాలు, సునీత, వెంకటమ్మ, యాదమ్మ ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News