Sunday, December 22, 2024

రోడ్డెక్కిన ఆశావర్కర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గోషామహల్: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్‌హెచ్‌ఎం కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రికత్తకు దారి తీ సింది. ఆశా వర్కర్ల 15 రో జుల సమ్మె నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పొ ందుపర్చిన హామీలు, 2024 ఫిబ్రవరి 9న ఆ రోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే ప రిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియ న్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి నీలాదేవిల నేతృత్వంలో మంగళవారం వేలాది మంది ఆ శావర్కర్లు కోఠిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. పెద్ద సంఖ్య లో తరలివచ్చిన ఆశాలను నియంత్రించేందుకు పోలీసు లు డిఎంహెచ్‌ఎస్ గేట్లను మూసేయడంతో కొందరు ఆ శాలు మొదటి గేట్‌పై నుండి లోపలికి గేట్ వరకు దూసుకువెళ్లి కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించగా, కొంతమంది ఆశా వర్కర్లు మెయిన్ రోడ్డుపై గల ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను వెంటనే ప రిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కొందరు ఆశావర్కర్లు కో ఠి ఉమెన్స్‌కళాశాల చౌరస్తాలో దిగ్బంధం చేయగా, మరి కొందరు ఆశా వర్కర్లు రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ ఆశా వర్కర్ సొమ్మసిల్లి కిందపడిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనదారు లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్బంగా ఆ శా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి ధర్నా ను ఉద్దేశించి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పారితోషికాలను రూ.18వేలకు పెం చి, ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ శాలకు నష్టం కలిగించే ఎగ్జా మ్స్‌ను పెట్టాలన్న యోచన ను వెంటనే విర మించుకోవాలన్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు చెల్లించడంతో పాటు ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2021జులై నుండి డిసెంబర్ వరకు 6 నెల ల పీఆర్సీ ఏరియర్స్, 2022, 2023, 2024 సంవత్సరాల లెఫ్రసీ స ర్వే పెండింగ్ డబ్బులు, 2024 మార్చి 3=5 వరకు మూడు రోజుల పల్స్ పోలియో డబ్బులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు విధులు నిర్వహించిన డబ్బులు వెంట నే చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం: ఎన్‌హెచ్‌ఎం కమిషనర్ ఆర్వీ కర్ణన్
ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఫిక్స్‌డ్ నిర్ణయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, రూ.50 లక్షల ఇన్సూరెన్స్ విషయమై బ్యాంక్ అధికారులతో చర్చిస్తున్నామని, 3 నెలల్లోగా జీవో జారీ చేస్తామని హామీనిచ్చారు. ఆగస్ట్‌లోగా ప్రింటెడ్ రిజిస్టర్స్ సప్లై చేస్తామని, మట్టి ఖర్చులు రూ.50 వేల జీవో జారీ చేయడంతో పాటు పల్స్ పోలియో డబ్బులు వచ్చాయని, వాటిని వెంటనే చెల్లిస్తామన్నారు. స్కూటమ్ డబ్బాలు ఆశా వర్కర్లతో మోయించవద్దని పై నుండి సర్కులర్ ఇవ్వడంతోపాటు ఇతర పెండింగ్ బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News