Monday, December 23, 2024

మావి న్యూట్రిషన్ పాలిటిక్స్… ప్రతిపక్షాలవి పార్టీషన్ పాలిటిక్స్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని, వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యుడు, సిబ్బంది ని దేవుడిగా ప్రజలు భావిస్తారని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పేదలకు ఉత్తమ సేవలు అందించడంలో కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పిల్లలకు 100% వ్యాక్సిన్ వేసిన రాష్ట్రం తెలంగాణ తొలి స్థానంలో ఉందని, 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీ లు సాధించామన్నారు. వైద్య ఆరోగ్యంలో 14 వ స్థానం నుంచి రాష్ట్రం ఏర్పడిన తరువాత 3వ స్థానంలోకి వచ్చామని ప్రశంసించారు.

Also Read: గుజరాత్‌కు రూ.20 వేల కోట్లు.. తెలంగాణకు రూ.500 కోట్లా?: కెటిఆర్

జిహెచ్ఎంసి పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు నియమితులైన 1560 మంది ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణకు ముందు ప్రైవేట్ లో 70%, 30% ప్రభుత్వ ఆసుపత్రులో డెలివరీలు ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వంలో 70% డెలివారీలు జరుగుతున్నాయని, న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తున్నామన్నారు. మనది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే కొందరివి పార్టీషన్ పాలిటిక్స్ గా మారిందని దుయ్యబట్టారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టె పార్టీషన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు ఆశాలు చెప్పాలన్నారు. టి డియాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామని, ఒక్కో ఆశ వర్కర్ పై 50 వేలు ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న 27వేల మంది ఆశాలకు శుభవార్త అని, ఈ నెల నుంచి ఆశాలకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

దేశంలో అత్యధిక వేతనం ఆశాలకు తెలంగాణలోనే ఇస్తున్నామని, నాలుకకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఆశాలకు గతంలో వేతనం పెంచమని ఆడిగితే గుర్రాలతో తొక్కించిన ఘటనలు చూశామని, అర్ధరాత్రి ఆశా వర్కర్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషల్ లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ ది అని గుర్తు చేశారు. రూ. 4500 జీతం మాత్రమే ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో ఆశాలకు వేతనం ఇస్తున్నారని, కాంగ్రెస్ వాళ్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. సెకండ్ ఎఎన్ ఎం లను కావాలనే రెచ్చగొడుతున్నారని, సెకండ్ ఏఎన్ ఎంలకు రాష్ట్రంలో 27000 లకు పైగా వేతనం ఇస్తున్నామని,  కాంగ్రెస్ , బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇంత వేతనం లేదని స్పష్టం చేశారు. ఎఎన్ఎం ల రిక్రూట్మెంట్ లో ఆశ వర్కర్లకే మొదట ప్రధాన్యత ఇస్తామని, కాంగ్రెస్, తెలుగు దేశం, బిజెపిలు బస్తీ ప్రజల సుస్థి గురించి ఆలోచించలేదన్నారు.

బస్తీ దవాఖాన సూపర్ హిట్ అయిందని, బస్తీ దవాఖానాల వల్ల ఉస్మానియాలో 60% ఒపి భారం తగ్గిందన్నారు. గాంధీకి హాస్పిటల్ లో 56% ఒపి తగ్గిందని, ఫీవర్ ఆసుపత్రిలో 72% ఒపి భారం తగ్గిందన్నారు. గర్భిణుల కోసం 3 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, గాంధీలో ఒక వారంలో సూపర్ స్పెషలిటీ ఎంసిహెచ్ ఆసుపత్రి ప్రారంభిస్తామని, రాష్ట్రంలో మాతా మరణాలను 42 కి తగ్గించామని, నాలుగు టైమ్స్ ఆసుపత్రులు త్వరలో అందుబాటులోకి వస్తున్నామయని హరీష్ రావు హామీ ఇచ్చారు. కోర్టు కేస్ పూర్తి అవ్వగానే ఉస్మానియా కి అధునాతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్ లో రోబోటిక్ యంత్రం అందుబాటులోకి వస్తుందని, నిమ్స్ వైద్యుల సేవలు అభినందనీయమని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News