హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు జంటనగరాల్లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. గోల్కొండ కోటపైనున్న జగదాంబికా అమ్మవారితొట్టెల ఊరేగింపు, బోనం సమర్పణతో గురువారం ఆషాడ బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరవుతారు. జగదాంబికా అమ్మవారి బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాక.. నెల రోజులపాటు ఆదివారాల్లో నగరవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగుతాయి. వచ్చేనెల 5న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ వేడుకలు, 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటం స్థాపన మొదలు జూలై 18 వరకు, జూలై 17న లాల్‌దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఘట్టాల ఊరేగింపుతో పాతనగరంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 24న లాల్‌దర్వాజ ఆలయంతోపాటు జంటనగరాల్లోన్ని అన్ని అమ్మవారి ఆలయాల్లో బోనాల పండుగను నిర్వహిస్తారు.