Wednesday, January 22, 2025

నేటి నుంచి జంగల్ విఠోబా ఆలయంలో ఆషాఢ మాస బోనాలు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ఉస్మాన్‌షాహీలోని చారిత్రాత్మక శ్రీ జంగల్ విఠోబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాడ మాసం తొలి ఏకాదశి పూజా మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ నుండి జులై 6వ తేదీ వరకు పూజా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేం దుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీ విఠలేశ్వర బాల భక్త సమాజం ఆధ్వర్యంలో ఆలయాన్ని రంగురంగు ల విద్యుద్దీపాలతో, ఆలయంలోని పాండురంగ, రుక్మాబాయి ఉత్సవ మూర్తులను రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించారు.

ప్రతీ యేటా నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ యేడాది కూడా ఆషాడమాసం ఏకాదశి రోజైన 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు మొదట గరుడ వాహనంపై ఆల యం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శేష వాహనంపై శ్రీవిఠలేశ్వర, రుక్మాబాయిల రథోత్సవం ప్రారంభమై అంగరంగ వైభవంగా పుర వీధుల్లో ఊరేగించనున్నారు. 28వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రతినిత్యం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బుధ వారం తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకంతో ఏకాదశి పూజా మహోత్సవాలు ప్రారంభమై స్వస్తి పుణ్యహవాచనం, ధ్వజారోహణ, గోపూజ, కలశ స్థాపన, అఖండ దీపారాధన, స్వామివారికి మహా నైవేద్యం, హారతి, అనంతరం భక్తులకు తీర్ద, ప్రసాద వితరణ చేపడ తారు.. రాత్రి 7 గంటలకు పల్లకీసేవ, హారతి, అష్టావధాన సేవ, భజన, ఏకాంతసేవల అనంతరం తీర్ద ప్రసాద ప ంపిణీ చేపడతారు.
రేపే విఠలేశ్వరుని రథోత్సవం…..
ఈనెల 29వ తేదీ గురువారం తెల్లవారుజామున 4:05 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి పంచామృత సహిత, పంచ సూక్త పవమాన మహాభిషేకం, 5:30 గంటలకు స్వామివారి సహస్ర పుష్పార్చన, 6 గంటలకు మహా మంగళ హారతి, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు.. సాయంత్రం 4 గంటలకు స్వామివారికి గరుడసేవ, 5 గంటలకు శ్రీపాండురంగ=రుక్మాబాయిల రథోత్సవ కార్యక్రమం ఆలయం నుండి ప్రారంభమై అఫ్జల్‌గంజ్ లైబ్రరీ, అఫ్జల్‌గంజ్ పాత పోలీస్‌స్టేషన్, మున్నాలాల్ దవాసాజ్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ ఛమన్, గౌలిగూడ పాత బస్ డిపోల మీ దుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుందని ఆలయ అర్చకులు గోవింద్‌రాజ్ మహరాజ్ తెలిపారు.

నగరం నలుమూలల నుంచి తరలి వచ్చే వేలాది భ క్త జనుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే శ్రీ విఠలేశ్వరస్వామి వారి రథోత్సవానికి ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీ లకు చెందిన ప్రముఖులు, అధఙకారులు విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయకమిటీ ఆలయకమిటీ ఛైర్మెన్ జి శంకర్‌యాదవ్, అధ్యక్షులు వి కిషన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పి మాణిక్‌రావు, కోశాధికారి వి పాండుయాదవ్‌లు తెలిపారు.

28వ తేదీ నుండి జులై 6 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం భక్తులకు తీర్ద, ప్రసాద వితరణతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయకమిటీ ప్రతినిధులు విజయ్‌కుమార్, బోయిని వెంకటేష్‌యాదవ్, రఘునందన్‌యాదవ్, వి రమేష్‌యాదవ్, వి,శ్రీకాంత్‌గౌడ్, ఎస్ ఆనంద్‌యాదవ్, వి గణేష్‌యాదవ్, ప్రకాష్‌చారి, వి శ్రీనివాస్‌గౌడ్, కట్ట రమేష్ ముదిరాజ్‌లు ఏర్పాట్లను పర్యవే క్షిస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News