Monday, January 20, 2025

ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఉత్కంఠ విజయం..

- Advertisement -
- Advertisement -

లండన్: యాషెస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన ఐదో, చివరి టెస్టులో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. సోమవారం చివరి రోజు 135/0 ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 334 పరుగులకు ఆలౌటైంది. 384 లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఆస్ట్రేలియా చివరి వరకు గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది.

అయితే కీలక సమయంలో ఇంగ్లండ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీసి జట్టును గెలిపించారు. ఓపెనర్లు వార్నర్ (60), ఖ్వాజా (72) పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ (54), ట్రావిస్ హెడ్ (43), కారీ (28) తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు, మోయిన్ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News