Wednesday, January 22, 2025

యాషెస్ సిరీస్‌: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు..

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగిన నాలుగో టెస్టులో చివరి రోజు ఉత్కంఠ మ్యాచ్ లో ఇంగ్లండ్‌ బ్యాట్స్ మెన్లు పోరాడి పరాజయాన్ని అడ్డుకున్నారు. ఆస్ట్రేలియా విధించిన 388 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఐదో రోజు ఆటముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో ఒక వికెట్ తీస్తే ఆసీస్ విజయం సాధించేది.. కానీ, క్రీజులో కుదురకున్న ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ స్టువర్ట్ బ్రాడ్(08), అండర్సన్(0)లు వికెట్ చేజార్చుకోకుండా పట్టుదలగా ఆడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ లో ఓపెనర్ జాక్ క్రాలే (77), బెన్ స్టోక్స్(60)లు అర్థ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ మూడు వికెట్లు పడగొట్టాడు. కమిన్స్, లియాన్ లు చెరో రెండు వికెట్లు తీయగా.. గ్రీన్, స్మిత్ లు ఒక్కో వికెట్ తీశారు. ఐదో టెస్టు జనవరి 14న హోబర్ట్ వేదికగా జరగనుంది.

Ashes Series: AUS vs ENG 4th Test Draw

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News