Monday, December 23, 2024

యాషెస్ నాలుగో టెస్టు డ్రా..

- Advertisement -
- Advertisement -

ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగుతున్న నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే 1-2తో వెనుకబడి, ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

చివరి రోజు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దు కావడంతో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉన్న ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 317, రెండో ఇన్నింగ్స్ లో 214/5 స్కోరు చేయగా.. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 592 పరుగుల భారీ స్కోరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News