Thursday, January 23, 2025

అచ్చ తెలుగు అమ్మాయి వరలక్ష్మిగా ఆషికా రంగనాథ్..(వీడియో)

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని తన తాజా చిత్రం ’నా సామి రంగ’తో మరో నూతన దర్శకుడు విజయ్ బిన్నీకి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుండగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్ ద్వారా వరలక్ష్మిగా పరిచయమైన ఆషికా రంగనాథ్ సాంప్రదాయ దుస్తులలో ఆభరణాలతో ఆకర్షణీయంగాఉంది. ఆమె అద్దం ముందు నిల్చుని, బీడీ తాగుతూ బయటి నుంచి తనను గమనిస్తున్న నాగార్జునను అనుకరిస్తున్నట్లు మేకర్స్ ఒక గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు.

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి తన స్పెల్‌బైండింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మైమరపించారు. ఆషికా రంగనాథ్ హాఫ్ శారీలో అచ్చ తెలుగు అమ్మాయి లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాసివ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ‘నా సామి రంగ’ సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News