Saturday, December 28, 2024

‘సర్దార్ 2’లో ఆషికా రంగనాథ్…

- Advertisement -
- Advertisement -

హీరో కార్తి ’సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇటివలే సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభమైంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ గ్రాండ్‌గా నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో మాళవిక మోహన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ’సర్దార్ 2’లో డాజ్లింగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో ఫిమేల్ లీడ్‌గా కనిపించనున్నారు. ఆషికా రంగనాథ్‌కు బర్త్ డే విషెస్ అందించిన మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ లోకి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News