Tuesday, December 24, 2024

ఫైనల్లో ఆశీష్ కుమార్, మోనిక

- Advertisement -
- Advertisement -

థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీ

Ashish Kumar Monica goes to final

ఫుకెట్: థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆశీష్ కుమార్, మోనిక, గోవింద్ సహాని, వరీందర్ సింగ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మ్యాచుల్లో భారత బాక్సర్లు అసాధారణ ఆటను కనబరిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్ ఆశీష్ కుమార్ అలవోక విజయంతో ముందంజ వేశాడు. ఇండోనేషియా బాక్సర్ రొబర్డ్‌తో జరిగిన పోరులో ఆశీష్ 50 తేడాతో జయకేతనం ఎగుర వేశాడు. ఇక మహిళల 48 కిలోల విభాగంలో భారత యువ బాక్సర్ మోనిక విజయం సాధించింది. వియత్నాంకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ జోసి గబుకోతో జరిగిన పోరులో మోనిక జయభేరి మోగించింది. మరోవైపు గోవింద్ సహాని కూడా ఫైనల్లో ప్రవేశించాడు. 48 కిలోల విభాగం పోరులో గోవింద్ ముందంజ వేశాడు. వియత్నాంకు చెందిన గుయెన్ ఫుంగ్‌తో జరిగిన పోరులో గోవింద్ 41 తేడాతో విజయం సాధించాడు. మరోవైపు 60 కిలోల విభాగం సెమీఫైనల్లో మరో భారత బాక్సర్ వరీందర్ సింగ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. పాలస్తినాకు చెందిన అబ్దుల్ రహ్మాన్ పోటీ నుంచి తప్పుకోవడంతో వరీందర్‌కు వాకోవర్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News