Monday, December 23, 2024

ప్రేమకు, పెళ్లికి వయస్సుతో పనేమిటి?

- Advertisement -
- Advertisement -

ముంబై: అచ్చట ముచ్చట అనేది ఏ వయస్సులోది ఆ వయస్సులో తీరాలన్నది పాత మాట. నేడంతా కొత్త పోకడ. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి అటు హిందీ సినిమాల్లో, ఇటు దక్షిణాది సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇటీవల కోల్ కతాలోని ఓ క్లబ్‌లో అస్సామ్‌కు చెందిన రూపాలి బారువాను వివాహమాడారు. ఆశిష్ విద్యార్థి ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ‘ద్రోహ్ కాల్’ సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం తదితర బాషా చిత్రాలన్నీ కలుపుకుని 11భాషల్లో 300 చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘పోకిరి’ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆశిష్ విద్యార్థి ఇదివరలో రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. ఆమె ప్రముఖ థియేటర్ ఆర్టిస్, సింగర్. ఆమె నాటి బెంగాలి నటి శకుంతల బారువా కూతురు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆశిష్‌ను పెళ్లాడినామె రూపాలి బారువా. ఈమె అస్సాంలోని గువాహతికి చెందింది. ఈమెకు కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్‌లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News