Monday, December 23, 2024

ఆమె వల్లనే విడిపోయాను: ఆశీష్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి ఇటీవల రూపాలీ బారువాను రెండో పెళ్లి చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఆయన తన మొదటి భార్య, నటి రాజోషి(పిలూ)కి గత ఏడాది విడాకులు ఇచ్చారు. ఆ తర్వాతే రూపాలిని ప్రేమించారు. ఆశీష్, పిలూలకు అర్థ్ అనే కొడుకున్నాడు. కొడుకు విషయంలో వారు గర్వపడుతుంటారు. ఇదిలావుండగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తానెందుకు తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో ఆశీష్ వివరించారు.

మా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సర్దుకుపోయే అవకాశం లేకుండింది. విషయాలు చాలా బాధాకరంగా మారాయి. ‘పిలూతో నేను దాదాపు 22 ఏళ్లపాటు సంసారిక జీవితం గడిపాను. మేము మా బాధ్యతలు కూడా చక్కగానే నెరవేర్చాము. కానీ గత కొన్ని సంవత్సరాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. మా భవిష్యత్తు గురించి మేము వేర్వేరుగా ఆలోచించడం మొదలుపెట్టాము. పిలూ, నేను భార్యాభర్తలమే కాక మంచి స్నేహితులం కూడా. మేము ఎన్నో విషయాలు మనస్సు విప్పి మాట్లాడుకుంటాం. కానీ మా మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. వాటిని మేము మేనేజ్ చేయలేక పోయాము. ఇంకా కలిసి ఉంటే కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగొచ్చనిపించింది. మేము ఒకరిపట్ల మరొకరం చాలా అప్‌సెట్‌గా, కోపంగా ఫీలయ్యాము’ అన్నారు.

తాము మాట్లాడుకున్నాం అని, తర్వాత న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నాం అని ఆశీష్ చెప్పారు. ‘సంసార జీవితాన్ని కాపాడుకోడానికి పూర్తి ప్రయత్నం చేశాను. ప్రొఫెషనల్స్ సాయం కూడా తీసుకున్నాం. కానీ ఏదీ పనిచేయలేదు. మేము కూర్చుని మాట్లాడాము. కొడుకు అర్థ్‌ను కూడా విశ్వాసంలోకి తీసుకున్నాం. కానీ ఈ సమయంలో నేను చాలా నొచ్చుకున్నాను. మనస్సుపూర్వకంగా కుటుంబాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించాను’ అన్నారు.

విడాకులు తీసుకునేప్పుడు కూడా తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని భార్యతో చెప్పానన్నారు. ‘నేను ఒంటరిగా జీవించాలనుకోలేదు. నాకు సహచరి అవసరం. మరొకరి సహచర్యంలో భద్రత ఉంటుంది. అదే విషయాన్ని నేను పిలూతో చెప్పాను. విడాకులు తీసుకున్నా నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని ఆమెతో స్పష్టంగా చెప్పాను. భవిష్యత్తులో నేను మరొకరితో జీవితం పంచుకుని నడువాలనుకుంటున్నానని కూడా చెప్పాను. అప్పుడామె, ‘ నీకేం తెలుసు? నేను నా జీవితాన్ని వేరేగా ఊహించుకుంటున్నాను’ అంది. దానికి నేను ‘కావొచ్చు, ఇక్కడ మనమిద్దరం… జీవితంలో ఓ అధ్యాయం పూర్తిచేశాము. మనం రెండు వేర్వేరు భాగాలను ఎంచుకున్నాం’ అన్నట్లు తెలిపారు. ఆశీష్ విద్యార్థి ఓ నటుడు, మోటివేషనల్ స్పీకర్, వ్లాగర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News