Sunday, January 19, 2025

టెన్నిస్‌కు ఆస్ట్రేలియా స్టార్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

Ashleigh Barty retires from tennis

ఆష్లే బార్టీ సంచలనం

మెల్‌బోర్న్: మహిళల టెన్నిస్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఆష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో బార్టీ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న బార్టీ 25 ఏళ్ల వయసులో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పెను ప్రకంపనలు సృష్టించింది. టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు టాప్ సీడ్ బార్టీ బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించింది. కొంతకాలంగా మహిళల టెన్నిస్‌లో బార్టీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచి జోరుమీదుంది.

కానీ అనూహ్యంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని తీసుకున్న నిర్ణయం టెన్నిస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కెరీర్‌లో బార్టీ మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. అంతేగాక మహిళల విభాగంలో ఎక్కువ రోజులు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన నాలుగో క్రీడాకారిణిగా బార్టీ రికార్డు సృష్టించింది. బార్టీ 121 వారాలుగా మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్ సీడ్‌గా కొనసాగుతోంది. ఇదిలావుండగా వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు బార్టీ వెల్లడించింది. ఇది చాలా కఠిన నిర్ణయమే అయినా తీసుకోక తప్పడం లేదని పేర్కొంది. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బార్టీ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News