Sunday, December 22, 2024

యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో…(గ్లింప్స్‌)

- Advertisement -
- Advertisement -

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసి అందరినీ అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్ ‘అశోక్ గల్లా 2’ చేస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించాడు.

లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశోక్ గల్లాకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్.. అతన్ని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించే గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News