Tuesday, November 5, 2024

రూ.500కే గ్యాస్ సిలిండర్..

- Advertisement -
- Advertisement -

అల్వార్: రాజస్థాన్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఉజ్జల పథకం లబ్ధిదారులకు రూ.500కే ఎల్‌పిజి సిలిండర్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. పేదరికం కారణంగా సిలిండర్‌ను పొందలేకపోతున్నవీరికి ఏప్రిల్ 1నుంచి తమ ప్రభుత్వం అందజేస్తుందని సిఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన గెహ్లాట్ దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలైన న్యాయ, ఎన్నికల సంఘంతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు భయాందోళనల నడుమ పనిచేస్తున్నాయన్నారు.

రాహుల్ గాంధీ జోడో యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ సిఎం గెహ్లాట్ మాట్లాడుతూ.. దేశం మొత్తం నిరుద్యోగం, ధరల పెరుగుదలతో కొట్టుమిట్టాడుతోందని, ఆర్థికవ్యవస్థ ఆరోపించారు. కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వం దేశాన్ని ఏ దిశగా తీసుకువెళుతుందో ఎవరికి తెలియడం లేదన్నారు. కేంద్రప్రభుత్వాన్ని ఎవరినైనా విమర్శిస్తే వారిని జైలుకు పంపుతున్నారు. గతంలో ఈడి, సిబిఐ, ఆదాయపుపన్నుశాఖలంటే ప్రజలు భయపడేవారు. ప్రస్తుతం ఈ సంస్థలు పైనుంచి ఎప్పుడు ఏ ఆదేశాలు వస్తాయో అని వాటికవే భయపడుతున్నాయని సిఎం గెహ్లాట్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News