Monday, December 23, 2024

రైతులకు, సామాన్యులకు బడ్జెట్ చేసిందేమీ లేదు: గెహ్లాట్

- Advertisement -
- Advertisement -

Ashok Gehlot Comments on Centre Budget 2022

జైపూర్: “కేంద్ర బడ్జెట్ ఆర్థికలోటును మరింత పెంచేదిగా ఉందే తప్ప, రైతులకు, సామాన్యులకు, పేదలకు, మహిళలకు ప్రత్యేకించిందంటూ ఏమీలేదు” అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. “ ఆర్థిక లోటును గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఇప్పుడీ బడ్జెట్ తర్వాత కూడా ఆ లోటు మరింత పెరుగనుంది. ఈ బడ్జెట్ రైతులు, సామాన్యులు, పేదలు, మహిళలు, అణగారిన వర్గాలవారికి ప్రత్యేకించి చేసిందంటూ ఏమీలేదు” అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. “ ఈ బడ్జెట్‌లో పేర్కొన్న కొత్త ఉద్యోగకల్పనకు క్రియాశీలక ప్రణాళిక అంటూ ఏదీ లేదు. ఇదివరలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనిచేసిన ప్రకటన వంటిదే ఇది కూడా” అని ఆయన పేర్కొన్నారు. “రాజస్థాన్ ప్రజలు ఈ బడ్జెట్ ద్వారా పూర్తి నిరాశకు గురయ్యారు. ఇఆర్‌సిపికి జాతీయ ప్రాజెక్ట్ హోదాను ఇచ్చే విషయం, జల్ జీవన్ మిషన్‌నకు 90:10 వాటాలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఖర్చు గురించి, జైసల్మేర్‌కాండ్లా రైల్వే లైన్, గులాబ్‌పురాలో ఎంఇఎంయూ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఈ బడ్జెట్‌లో ప్రస్తావించలేదు” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News