Wednesday, January 22, 2025

కాంగ్రెస్ నేత గెహ్లోట్‌కు కోవిడ్, స్వైన్‌ఫ్లూ..

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్‌కు ఏకకాలంలో కోవిడ్ 19, స్వైన్‌ఫ్లూ సోకింది. వైద్య పరీక్షల తరువాత శనివారం ఈ అస్వస్థత నిర్థారణ అయింది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డాక్టర్ల పరీక్షల నేపథ్యంలో తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని గెహ్లోట్ శనివారం ఎక్స్ సామాజిక మాధ్యమంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో తనకు తరచూ జ్వరం ఇతరత్రా సమస్యలు ఉండటంతో డాక్టర్ల సలహా మేరకు పరీక్షలు చేయించుకున్నట్లు ఈ క్రమంలో కోవిడ్, స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్థారణ అయినట్లు ఈ సీనియర్ నేత తెలిపారు. వాతావరణ మార్పుల దశలో ప్రతి ఒక్కరూ సరైన రీతిలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News