Friday, November 22, 2024

ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్న అశోక్ గహ్లోత్

- Advertisement -
- Advertisement -

ashok gehlot to file nomination for congress president post today zws 70 |  Loksatta

 

జైసల్మేర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓ విశేషమైన ప్రకటన చేశారు. తాను ఆగస్టులోనే సోనియా గాంధీకి తన రాజీనామా ప్రస్థావన చెప్పానని అన్నారు. ఆమె తనతో రాజస్థాన్‌పట్ల తనకు అమిత ప్రేమం ఉందని, అది ఎల్లకాలం ఉంటుందన్నారని తెలిపారు. ఢిల్లీ వెళతారా అని ప్రశ్నించినప్పుడు ఆయన తనకు కాంగ్రెస్ కావలసిందంతా ఇచ్చిందన్నారు. ఇప్పుడు కొత్త తరానికి కూడా అవకాశం ఇవ్వనివ్వండి అన్నారు. దీంతో ఆయన తన రాజీనామా సమర్పించుతారని తెలుస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి తదుపరి ఎవరవుతారు? అని అడిగినప్పుడు ఆయన శాసనసభ్యులంతా కూర్చున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ అది బ్రహ్మాండంగా కొనసాగుతోందన్నారు. నేను సిఎంగా ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా తన సందేశం మాత్రం ప్రేమపూర్వకంగా ఉంటుందన్నారు. తన కోరిక యువత కన్నా ఎక్కువ పనిచేయాలన్నదేనన్నారు. ఎక్కడ కూడా ఉద్రిక్తత ఏర్పడకూడదన్నారు. మన నాయకులు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారు ఎల్లప్పుడూ దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకున్నారన్నారు. అశోక్ గహ్లోత్ ఆదివారం జైసల్మేర్ వెళ్లి తనోట మాతా దర్శనం చేసుకున్నారు. ఆయన దేశంలో సామరస్యాలు నెలకొనాలని కోరుకున్నారు. అర్చనల తర్వాత ఆయన మానవులందరికీ మేలు జరగాలన్నారు. తాను తన రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటానన్నారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు తన శాసన సభ్యులతో ఆయన సమావేశం అవుతారు. అందులో ఆ రాష్ట్రానికి చెందిన అందరు మంత్రులు, శాసనసభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా చేస్తారని కూడా తెలుస్తోంది. నిజానికి ఈ శనివారం నుంచే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలయిపోయింది. ఈ ఎన్నికల్లో తన నామినేషన్ వేసే ముందే అశోక్ గహ్లోత తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News