Wednesday, January 22, 2025

తప్పులో కాలేసిన రాజస్థాన్ సిఎం: పాత బడ్జెట్ పఠనం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పులో కాలేశారు. 2023-24 బడ్జెట్ స్థానంలో ఆయన గురువారం అసెంబ్లీలో పాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టి పావుగంటకు పైగా చదవడంతో సభలో రభస జరిగింది. దీన్ని మానవ తప్పిదంగా గెహ్లాట్ ప్రకటించి క్షమాపణ చెప్పినప్పటికీ సభలో ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

చివరకు మరోరోజు బడ్జెట్‌ను ప్రవేశపెడతామని ప్రకటించి ముఖ్యమంత్రి సభను వాయిదా వేశారు. బడ్జెట్ పత్రాలు లీకయ్యాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష బిజెపి సభ్యులు బడ్జెట్ ప్రసంగంపై అభ్యంతరాలు తెలియచేయడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. గురువారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గెహ్లాట్ 15 నిమిషాలపాటు దాన్ని చదివారు. తాను చదువుతున్నది పాత బడ్జెట్ అని గ్రహించిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని నిలిపివేశారు.

అరగంట పాటు వాయిదాపడిన సభ తిరిగి కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రారంభమైంది. వసుంధర రాజె ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తప్పుడు గణాంకాలతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, వాటిని కూడా సరిదిద్దామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో బిజెపి సభ్యురాలు వసుంధర రాజె అభ్యంతరం తెలిపారు. ముఖ్యమంత్రి గెహ్లాట్ పూర్తి నిర్లక్షంగా వ్యవహరించారని, ఇలాంటి కాగితాలను ముఖ్యమంత్రి తెస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News