Thursday, January 23, 2025

ఏప్రిల్ 22న ‘అశోకవనంలో…’

- Advertisement -
- Advertisement -

Ashoka Vanamlo Arjuna Kalyanam to release on April 22

‘ఫలక్‌నుమా దాస్’ నుంచి ‘పాగల్’ వరకు వైవిధ్యమైన చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “ఈ సినిమాలో విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. అతను ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్… అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా హిలేరియస్‌గా ఉంటుంది” అని మేకర్స్ తెలిపారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ చిత్రానికి హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ డైరెక్టర్ రవికిరణ్ కోలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. దర్శకుడు విద్యా సాగర్ చింతా ఈ చిత్రాన్ని తెర్కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

Ashoka Vanamlo Arjuna Kalyanam to release on April 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News