Friday, December 20, 2024

డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఖండించిన బిగ్ బాస్ ఫేమ్

- Advertisement -
- Advertisement -

తెలుగు బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కెపి చౌదరి ప్రమేయం ఉందని సోషల్ మీడియా ఊహాగానాలపై నటి స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదన్న ఆశు రెడ్డి నివేదికలను తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అవసరమైతే సరైన సమయం వచ్చినప్పుడు సంబంధిత వర్గాలకు నిజానిజాలు వెల్లడిస్తానని ఆమె వ్యక్తం చేశారు. ఆమె అనుమతి లేకుండా ఆమె ఫోన్ నంబర్‌ను బహిరంగంగా వెల్లడించకూడదని హెచ్చరించారు.

గతంలో డ్రగ్స్ కేసులో నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం, రెండు రోజుల పోలీసు కస్టడీలో చౌదరి విచారణలో ఉన్నాడు. విచారణలో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌లో పాల్గొన్న ఇద్దరు నటీమణులతో కె.పి చౌదరి విస్తృతంగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు వెల్లడైంది. అయితే, చౌదరి ఈ కాల్‌ల గురించి మౌనంగా ఉండటం, కెపి చౌదరి కనెక్షన్ల ద్వారా పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్‌ను కొనుగోలు చేయడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News