విశాఖపట్నం: లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగి న మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో తన జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయం లో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ ఐపిఎల్ చరిత్రలో చిరకాలం గుర్తుండి పోయే అద్భుత ఇన్నింగ్స్ ఆ డాడు. విప్రాజ్ నిగమ్‌తో కలిసి అతను చేసిన బ్యా టింగ్ విన్యాసాలను ఎంత పొగిడినా తక్కువే. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చివరి వరకు క్రీ జులో నిలిచి జట్టునె గెలిపించిన తీరును అభిమానులు ఎప్పటికీ మరచి పోలేరు.
అసాధారణ బ్యా టింగ్‌తో అలరించిన అశుతోష్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కీలక ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరినా అశుతోష్ మాత్రం చివరి వరకు క్రీజులో పాతుకు పోయి జట్టును గెలిపించిన తీరును ప్రతి ఒక్కరు కొనియాడుతున్నా రు. అతని బ్యాటింగ్ తీరు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, కోహ్లిల ను తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లే దు. పరుగులు ఛేదనలో ఈ బ్యాటర్లు కూడా ఇలా నే ఆడుతూ తమతమ జట్లను గెలిపించే వారు. తాజాగా అశుతోష్ కూడా ఇలాంటి బ్యాటింగ్‌ను కనబరుస్తూ సరికొత్త స్టార్‌గా అవతరించాడు. రా నున్న రోజుల్లో అశుతోష్ మరిన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆశ్చర్యం లేదు.
గాయం బాధిస్తున్నా..
మరోవైపు లక్నో మ్యాచ్ సందర్భంగా అశుతోష్ గా యానికి గురయ్యాడు. ఒకవైపు గాయం బాధిస్తు న్నా అతను పట్టుదలతో ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించాడు. తీవ్ర నొప్పిని సయితం దిగమింగుకుంటూ అతను పోరాటం కొనసాగించా డు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రధాన కోచ్ హేమంగ్ బ దాని మీడియాకు వెల్లడించాడు. ఒకవైపు గాయం, మరో వైపు తీవ్ర ఒత్తిడి నెలకొన్న స్థితిలో అశుతోష్ ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఐపిఎల్‌లో తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.
కాగా, లక్నోతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అశుతోస్ 31 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 5 బౌండరీలతో అజేయంగా 66 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విప్రాజ్ నిగమ్ (39)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఢిల్లీకి సంచలన విజయం సాధించి పెట్టాడు. కిందటి సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అశుతోష్ అప్పట్లో శశాంక్ సింగ్‌తో కలిసి పెను ప్రకంపనలు సృష్టించాడు. అశుతోష్, శశాంక్‌లు కలిసి ఆ సీజన్‌లో పంజాబ్‌కు పలు మ్యాచుల్లో ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టారు.