హైదరాబాద్‌ః గవర్నర్ తమిళిసైతో ఆర్టీసి యూనియన్ నాయకుల బృందం చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం ఆర్టీసి కార్మికసంఘాల నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. “ఆదరాబాదరాగా బిల్లు రూపొందిస్తే కార్మకులు ఇబ్బందుల్లో పడతారని గవర్నర్ చెప్పారు. గవర్నర్ నిర్ణయం.. చారిత్రాత్మక నిర్ణయం. మా తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆమెను మా దేవతగా భావిస్తున్నాం. గవర్నర్ లేవనెత్తిన 5 ప్రశ్నల్లో 4 కార్మికుల ప్రయోజనాలకు సంబంధించినవే. కార్మికులకు రెండు పిఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయని గవర్నర్ గుర్తు చేశారు.
గవర్నర్ కు కార్మికుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. బలవంతంగా ఆందోళనకు వచ్చామని కార్మికులే చెప్పారు. థామస్ రెడ్డి అనే వ్యక్తి వెనుక ఏ యూనియన్ లేదు. ఏ సంఘానికి నాయకత్వం లేని నాయకుడు బంద్ కు పిలుపు ఇస్తారా?. ఇది ప్రభుత్వం నిర్వహించిన సమ్మెగానే భావించాలి. ఎక్కడైనా అసెంబ్లీ కేవలం మూడు రోజుల్లో ముగిస్తారా?.” అని ప్రశ్నించారు.