Thursday, December 26, 2024

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌.. రవిచంద్రన్ అశ్విన్ రికార్డు

- Advertisement -
- Advertisement -

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో అశ్విన్ రెండు కీలక వికెట్లు తీయడంతో ఈ ఘనత సాధించాడు.

ప్రస్తుతం అశ్విన్‌ 188 వికెట్లు తీశాడు. దీంతో డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. తర్వాత నాథన్ లియోన్ 187 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కాగా,  టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులతో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News