Thursday, January 23, 2025

అశ్విన్‌కు టాప్ ర్యాంక్‌..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌ను వెనక్కినెట్టి అశ్విన్ మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అశ్విన్ ప్రస్తుతం 864 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. అండర్సన్ 859 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు.

ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్ మూడో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు భారత మరో స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఒక ర్యాంక్‌ను మెరుగుపరుచుకుని 8వ స్థానానికి ఎగబాకాడు. బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ లబుషేన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. లబుషేన్ 912 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మరో స్టార్ స్టీవ్ స్మిత్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ రెండు ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని మూడో స్థానానికి చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News