- Advertisement -
జట్టులో ఎదురవుతున్న వరుస అవమానాలను భరించలేకనే రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడని సిఎస్‌కె మాజీ ఆటగాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ పేర్కొన్నాడు. అశ్విన్ వంటి సీనియర్ ఆటగాడికి జట్టులో ప్రతిసారి అవమానాలే ఎదురయ్యాయన్నాడు.
ఎలాంటి కారణం లేకుండానే అతనికి తుది జట్టు నుంచి ఉద్వాసన పలికే వారన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అశ్విన్ ప్రతిభకు తగినంత గుర్తింపు టీమిండియాలో లభించలేదన్నాడు. పలు టెస్టుల్లో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టినా అతన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నాడు. జట్టులో తనకు తగిన గుర్తింపు లేదని భావించిన అశ్విన్ రిటైర్మెంట్ వంటి కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడన్నాడు.
- Advertisement -