Thursday, December 19, 2024

క్రికెట్ కు అశ్విన్ అల్విదా

- Advertisement -
- Advertisement -

రవిచంద్రన్ సంచలన నిర్ణయం
షాక్‌లో అభిమానులు

బ్రిస్బేన్: భారత స్టార్ క్రికెటర్ రవిచం ద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో బుధ వారం మూడో టెస్టు ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిం చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ రిటై ర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వే గానికి గురైన వీడియో సోషల్ మీడి యాలో వైరల్‌గా మారింది. అశ్విన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో సహచర క్రికెటర్లతో పాటు బిసిసిఐ, అభిమానులు షాక్‌కు గురయ్యారు. అశ్విన్ ఇలాంటి ప్రకటన చేస్తాడనే ఎవరూ ఊహించలేదు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉన్నా అతను ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడనేది ఎవరికీ అంతుబట్ట కుండా పోయింది.

భావోద్వేగ ప్రకటన..

మీడియా సమావేశంలో మాట్లాడుతూ అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు.‘భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. మూడు ఫార్మాట్‌ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. మరి కొంతకాలం పాటు క్రికెట్ ఆడే సత్తా నాలో ఉందని అనుకుంటున్నా. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతా. అయితే టీమిండియా తరఫున మళ్లీ ఆడే ప్రసక్తే లేదు. సుదీర్ఘ కాలంగా సాగిన కెరీర్‌లో ఎన్నో తీపి, జ్ఞాపకాలు తనకు ఉన్నాయి. ఎన్నో అనుభవాలను అందించిన సహచర క్రికెటర్లకు కృతజ్ఞతలు.

కెరీర్‌లోతనకు అండగా నిలిచన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది తదితరులకు సదా రుణపడి ఉంటా. ఈ సందర్భంగా ఎంతో మందిని గుర్తు చేసుకోవాలి. తనకు టీమిండియా తరఫున ఆడే అవకాశంకల్పించిన భారత క్రికెట్ బోర్డుకు సదా రుణపడి ఉంటా. విరాట్, అజింక్య, పుజారా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సహచరులు తన కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించారు. నా బౌలింగ్‌లో స్లిప్పుల్లో ఎన్నో క్యాచ్‌లను పట్టుకొని నాకు వికెట్లను అందించిన సహచర ఆటగాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆస్ట్రేలియా క్రికెట్‌కూ కూడా కృతజ్ఞతలు. నాకు మంచి పోటీ ఇచ్చిన క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా. తాను సాధించిన రికార్డుల్లో అత్యధికంగా ఆసీస్‌పైనే ఉండడం గర్వంగా ఉంది’.. ఇలా పలు విషయాలను వెల్లడించిన అశ్విన్ కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు.

నేడు స్వదేశానికి..

ఇదిలావుంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు అశ్విన్ దూరమయ్యాడు. గురువారం అతను భారత్‌కు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మీడియా మాట్లాడిన రోహిత్ ఈ విషయం చెప్పాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. మిగిలిన రెండు అతను ఆడడని వెల్లడించాడు. స్వదేశానికి వెళ్లిపోతాడని తెలిపాడు. భారత క్రికెట్‌కు లభించిన అద్భుత క్రికెటర్లలో అశ్విన్ ఒకడు. జట్టుకు అతను అందించిన సేవలు చిరకాలం గుర్తుండి పోతాయి. అతనిలాంటి క్రికెటర్ లభించడం చాలా కష్టం. టీమిండియాకు అద్భుత సేవలు అందించిన అశ్విన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. అతని సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగాలని కోరుకుంటున్నా అంటూ రోహిత్ పేర్కొన్నాడు.

నీ సేవలు మరువలేని: బిసిసిఐ

అశ్విన్ రిటైర్మెంట్‌పై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అశ్విన్ అందించిన సేవలను పొగుడుతూ భా వోద్వేగ ట్విట్‌ను పోస్ట్ చేసింది. ‘థ్యాంక్యూ అశ్విన్. అద్భు తం. ఇన్నోవేషన్. తెలివైన బౌలర్‌కు పర్యాయపదంగా మా రావు. బౌలర్‌గా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పో షించావు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశావు. నీ సేవ లు చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. లెజండరీ కెరీర్‌ను కొనసాగించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంది.

అశ్విన్ ప్రస్థానం..

ఆడిన టెస్టులు 106
ఇన్నింగ్స్ 151
చేసిన పరుగులు 3503
సెంచరీలు 6
అర్ధ సెంచరీలు 14
వికెట్లు 537
ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు 37 సార్లు
ఇన్నింగ్స్‌లో పది వికెట్లు 8 సార్లు
116 వన్డేల్లో 707 పరుగులు, 156 వికెట్లు
65 టి20ల్లో 184 పరుగులు, 72 వికెట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News